గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో 2012 నవంబర్ 18 వ తేదీన అనకాపల్లి శాఖా గ్రంధాలయంలో శ్రీ కొత్తపల్లి బంగార రాజు ఉపన్యాసకులుగా " తెలుగు సాహిత్యం - ప్రదర్శన' అనే అంశంపై సాహిత్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షునిగా క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీ గట్టి బ్రహ్మాజీ, ముఖ్య అతిథిగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ శ్రీ తోట నగేష్, ఆత్మీయ అతిథిగా సిహెచ్.లక్ష్మి సాహితీ శిరీష గ్రంధాలయ అధికారిణి పాల్గొన్నారు.
INDIAN HAIKU CLUB ( I.H.C.) ఇండియన్ హైకూ క్లబ్
Sunday, November 18, 2012
Monday, October 29, 2012
E-Book Haiku Compilation by Indian Haiku Club
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో ఈ- బుక్
ప్రముఖ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ " ఇండియన్ హైకూ క్లబ్ " ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హైకూలను ఈ-బుక్ హైకూ సంకలనాన్ని రూపొందించి వ్యాప్తి చెయ్యడానికి కవులనుండి హైకూలను ఇంతకు ముందెన్నడూ ఏ పత్రికలోనూ , సంపుటాలలో ప్రచురింప బడని పది హైకూ లను మాత్రమే కవులు పంపించవలసి ఉంటుంది. ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా ప్రపంచం నలుమూలల ఉన్న సాహిత్యాభిమానులు హైకూలను చదువుకో వచ్చు. ఒకే ఒక క్లిక్ ద్వారా ఈ - బుక్ ను నెట్ ద్వారా రీడర్స్ వారి కంప్యూటర్ లో సేవ్ చేసుకో వచ్చు.
హైకూలను పంపించే పద్ధతి:
- కవులు వారి పది హైకూలను " Dr.Talathoti Prithvi Raj, # No:6-5, 6th Street, Sarada Nagar, ANAKAPALLI-531001, VISAKHAPATNAM DIST." అనే అడ్రెస్ కు పోస్ట్ ద్వారా పంపించ వచ్చు
- indianhaikuclub@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు కవులు పేపర్ పై రాసిన హైకూలను స్కాన్ చేసి అటాచ్ ఫైల్స్ గా పంపించవచ్చు.
- తెలుగులో టైపు చేసి మెయిల్ పంపించవచ్చు.
- పి.డి.ఎఫ్. ఫైల్ ను మెయిల్ కు పంపించవచ్చు.
- హైకూలను పంపించడానికి చివరి తేది 8 డిసెంబర్ 2012.
- ఇంకా ఏమైనా సందేహాలుంటే 9963299452 సెల్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
Sunday, October 28, 2012
అనకాపల్లి కవులు-రచయితల సదస్సు
ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 18 న " అనకాపల్లి కవులు-రచయితలు" రచనలపై ఒక రోజు సదస్సు జరగనున్నది.ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే:
- అనకాపల్లి కి చెందిన కవులు, రచయితలు వివిధ పత్రికలలో ప్రచురింపబడిన వారి రచనలను, వారు ప్రచురించిన సంపుటులను లేదా ప్రచురణను పొందిన సంకలనాలను ఒకో కాపీ చొప్పున నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది.
- పాస్ పోర్ట్ సైజు ఫోటో అందజెయ్యాలి.
- మీకు సంబంధించిన సంక్షిప్త పరిచయ పత్రాన్ని అందించాలి.
- 100/- రూపాయలు మెంబర్ షిప్ ఫీజ్ గా చెల్లించవలసి ఉంటుంది..
- ఒకో కవికి పదినిమిషాల సమయం కేటాయించడం జరుగుతుంది. ఈ నిర్ణీత సమయంలోనే కవులూ రచయితలు కవులు, రచయితలు వారి రచనా నేపథ్యాన్ని,ప్రేరణను లక్ష్స్యాలను రచనలలోని అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది.
కార్యక్రమ ఏర్పాట్లు :
- భోజన వసతి ఏర్పాటు ఉంటుంది.
- అనకాపల్లి కవులు, రచయితల పుస్తకాల ప్రదర్శన.
- గ్రూప్ ఫోటో.
- ఫోటో గ్రాఫ్స్, వీడియో చిత్రీకరణ.
- కవిని/రచయితను జ్ఞాపికతో సత్కరించడం జరుగును.
Tuesday, June 26, 2012
శ్రీ బి.వి.బంగార్రాజు గారి శతక పద్యాల పఠన పోటీ
ఇండియన్ హైకూ క్లబ్ 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది. తెలుగు పద్యాలపట్ల విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ హైకూ క్లబ్ కు సుపరిచితులైన పద్యకవి శ్రీ బి.వి.బంగార్రాజు గారు రచించిన "మౌనీ రాగాలు", చైతన్య రాగాలు" పద్యకవితా సంపుటులలోని 30 ముఖ్యమైన,సందేశాత్మకమైన, నీతిదాయకమైన శతక పద్యాలను ఎంపిక చేసి ఈ పద్యకవితా పఠన పోటీ నిర్వహించబోతుంది. అతి తేలిక పదాలతో సరళంగా, సహజంగా, మంచి భావుకతతో పద్యాలను రచించే "విశాఖరత్న" బిరుదాంకితులు శ్రీ బి.వి.బంగార్రాజు పద్యాలు విద్యార్థులు కొన్నైనా నేర్చుకోవాలని ఇండియన్ హైకూ క్లబ్ అభిలాష. అందుకే విద్యార్థుల్లో ఆసక్తిని, ఉత్సాహాన్ని, పోటీ తత్వాన్ని కలిగించేలా ఆకర్షణీయమైన నగదు బహుమతులను విజేతలకు ఇవ్వబోతున్నాము. విజేతలకు నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్ లు ఇవ్వడం జరుగును. ఉత్తమ పోటీదారులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ("పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్ ప్రదానం" అని పి .డి.ఎఫ్.ఫైల్ లో రాసిన తప్పుని సవరించడ మైనది.).
నియమ నిబంధనలు:
- విజేతలైన విద్యార్థులు వారు చదువుతున్న స్కూల్,తరగతిని ద్రువపరిచే ఆధారం ఉండాలి.
- 5,6,7,8,9,10 లోపువారు కాదని విచారణలో తేలితే తీసుకున్న నగదును విజేతలు వాపసు చెయ్యాల్సి ఉంటుంది.
- పద్యాలను చూడకుండా మాత్రమే చదవాలి.
- ఎంపిక చేసిన 30 పద్యాలలోనుంచి 5 పద్యాలను మాత్రమే చదవడానికి సమయం కేటాయించడం జరుగుతుంది.
- రాగయుక్తంగా,భావయుక్తంగా,దోషరహితంగా పద్యాలను సభలో వినిపించిన వారికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం.
- ఉదయం ఖచ్చితంగా 9 గంటలకు పోటీ ప్రారంభమౌతుంది.
- సాయంత్రం 5 గంటలకు విజేతలకు బహుమతులు, ఉత్తమ పోటీ దారులకు సర్టిఫికెట్స్ ప్రదానం చెయ్యడం జరుగును.
- ఎంతమంది వస్తారో తెలియదు గనుక నిర్వాహకులు మద్యాహ్నం భోజన ఏర్పాట్లు చెయ్యడం లేదు. ఈ పోటీ 9 గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల లోపు ముగుస్తుంది గనుక విద్యార్థులు, వారితో వచ్చిన వారి తల్లిదండ్రులు వారి భోజన ఏర్పాట్లు వారే చూసుకుంటే మంచిది.
- పద్యాలను రాగయుక్తంగా చదవాలనుకుంటే www.bvbangarraju.com సైట్లోని కొన్ని పద్యాలు మీకు పనికివస్తాయి.
Subscribe to:
Posts (Atom)