Tuesday, June 26, 2012

శ్రీ బి.వి.బంగార్రాజు గారి శతక పద్యాల పఠన పోటీ

     ఇండియన్ హైకూ క్లబ్ 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది. తెలుగు పద్యాలపట్ల విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ హైకూ క్లబ్ కు సుపరిచితులైన పద్యకవి శ్రీ బి.వి.బంగార్రాజు గారు రచించిన "మౌనీ రాగాలు", చైతన్య రాగాలు" పద్యకవితా సంపుటులలోని 30 ముఖ్యమైన,సందేశాత్మకమైన, నీతిదాయకమైన శతక పద్యాలను ఎంపిక చేసి ఈ పద్యకవితా పఠన పోటీ నిర్వహించబోతుంది. అతి తేలిక పదాలతో సరళంగా, సహజంగా, మంచి భావుకతతో పద్యాలను రచించే "విశాఖరత్న" బిరుదాంకితులు శ్రీ బి.వి.బంగార్రాజు పద్యాలు విద్యార్థులు కొన్నైనా నేర్చుకోవాలని ఇండియన్ హైకూ క్లబ్ అభిలాష. అందుకే విద్యార్థుల్లో ఆసక్తిని, ఉత్సాహాన్ని, పోటీ తత్వాన్ని కలిగించేలా ఆకర్షణీయమైన నగదు బహుమతులను విజేతలకు ఇవ్వబోతున్నాము. విజేతలకు నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్ లు ఇవ్వడం జరుగును. ఉత్తమ పోటీదారులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ("పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్ ప్రదానం" అని పి .డి.ఎఫ్.ఫైల్ లో రాసిన తప్పుని సవరించడ మైనది.).

నియమ నిబంధనలు:
  • విజేతలైన విద్యార్థులు వారు చదువుతున్న స్కూల్,తరగతిని ద్రువపరిచే ఆధారం ఉండాలి.
  • 5,6,7,8,9,10 లోపువారు కాదని విచారణలో తేలితే తీసుకున్న నగదును విజేతలు వాపసు చెయ్యాల్సి ఉంటుంది.
  • పద్యాలను చూడకుండా మాత్రమే చదవాలి.
  • ఎంపిక చేసిన 30 పద్యాలలోనుంచి 5 పద్యాలను మాత్రమే చదవడానికి సమయం కేటాయించడం జరుగుతుంది.
  • రాగయుక్తంగా,భావయుక్తంగా,దోషరహితంగా పద్యాలను సభలో వినిపించిన వారికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం.
సూచనలు:
  • ఉదయం ఖచ్చితంగా 9 గంటలకు పోటీ ప్రారంభమౌతుంది. 
  • సాయంత్రం 5 గంటలకు విజేతలకు బహుమతులు, ఉత్తమ పోటీ దారులకు  సర్టిఫికెట్స్ ప్రదానం చెయ్యడం జరుగును.
  • ఎంతమంది వస్తారో తెలియదు గనుక నిర్వాహకులు మద్యాహ్నం భోజన ఏర్పాట్లు చెయ్యడం లేదు. ఈ పోటీ 9 గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల లోపు ముగుస్తుంది గనుక విద్యార్థులు, వారితో వచ్చిన వారి తల్లిదండ్రులు వారి భోజన ఏర్పాట్లు వారే చూసుకుంటే మంచిది.
  • పద్యాలను రాగయుక్తంగా చదవాలనుకుంటే www.bvbangarraju.com సైట్లోని కొన్ని పద్యాలు మీకు పనికివస్తాయి.



Sri B.V.Bangarraju gaari Shathakapadyaala pathana potee


Friday, June 15, 2012

శ్రీశ్రీ వర్థంతి సభ







"ఆధునిక కవిత్వానికి ఊపిరిపోసి ఉరకలెత్తిచ్చిన కవి శ్రీశ్రీ" అని ఇండియన్ హైకూ క్లబ్ ప్రధాన కార్యదర్శి జి.బ్రహ్మాజీ అన్నారు. శారదానగర్ లోని శ్రీ సూర్యా కాన్సెప్ట్ స్కూల్ లో శుక్రవారం సాయంత్రం "ఇండియన్ హైకూ క్లబ్ " ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. తొలుత ఇండియన్ హైకూ క్లబ్ అధ్యక్షులు డా.తలతోటి పృథ్వీ రాజ్ శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
     కష్టజీవికి ఇరువైపులా నిలిచేవాడే కవి అని చెప్పి నిరూపించిన కవి శ్రీశ్రీ అని మాధవీ సనారా శ్రీశ్రీని కొనియాడారు. నిడివిగల గేయాలను, కవిత్వాన్ని రాయడంలో  ప్రత్యేకత గల కవి శ్రీశ్రీ అని డా.యిమ్మిడిశెట్టి చక్రపాణి  అన్నారు. సామాన్యులలోకి శ్రీశ్రీ సాహిత్యం వెళ్ళడం వల్లే  శ్రీశ్రీని మహాకవిగా నిలబడ్డాడని ప్రమిఖ కథకులు,హైకూక్లుబ్ గౌరవ అధ్యక్షులు జి.రంగబాబు అన్నారు.
     ఈ కార్యక్రమములో శ్రీ సూర్యా కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ ప్రసాద్  , టీచర్ రామకృష్ణ, జి.ఎస్.కె.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.