ఇండియన్ హైకూ క్లబ్ 5,6,7,8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంది. తెలుగు పద్యాలపట్ల విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ హైకూ క్లబ్ కు సుపరిచితులైన పద్యకవి శ్రీ బి.వి.బంగార్రాజు గారు రచించిన "మౌనీ రాగాలు", చైతన్య రాగాలు" పద్యకవితా సంపుటులలోని 30 ముఖ్యమైన,సందేశాత్మకమైన, నీతిదాయకమైన శతక పద్యాలను ఎంపిక చేసి ఈ పద్యకవితా పఠన పోటీ నిర్వహించబోతుంది. అతి తేలిక పదాలతో సరళంగా, సహజంగా, మంచి భావుకతతో పద్యాలను రచించే "విశాఖరత్న" బిరుదాంకితులు శ్రీ బి.వి.బంగార్రాజు పద్యాలు విద్యార్థులు కొన్నైనా నేర్చుకోవాలని ఇండియన్ హైకూ క్లబ్ అభిలాష. అందుకే విద్యార్థుల్లో ఆసక్తిని, ఉత్సాహాన్ని, పోటీ తత్వాన్ని కలిగించేలా ఆకర్షణీయమైన నగదు బహుమతులను విజేతలకు ఇవ్వబోతున్నాము. విజేతలకు నగదు బహుమతితో పాటు సర్టిఫికేట్ లు ఇవ్వడం జరుగును. ఉత్తమ పోటీదారులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ("పోటీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికేట్ ప్రదానం" అని పి .డి.ఎఫ్.ఫైల్ లో రాసిన తప్పుని సవరించడ మైనది.).
నియమ నిబంధనలు:
- విజేతలైన విద్యార్థులు వారు చదువుతున్న స్కూల్,తరగతిని ద్రువపరిచే ఆధారం ఉండాలి.
- 5,6,7,8,9,10 లోపువారు కాదని విచారణలో తేలితే తీసుకున్న నగదును విజేతలు వాపసు చెయ్యాల్సి ఉంటుంది.
- పద్యాలను చూడకుండా మాత్రమే చదవాలి.
- ఎంపిక చేసిన 30 పద్యాలలోనుంచి 5 పద్యాలను మాత్రమే చదవడానికి సమయం కేటాయించడం జరుగుతుంది.
- రాగయుక్తంగా,భావయుక్తంగా,దోషరహితంగా పద్యాలను సభలో వినిపించిన వారికే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం.
- ఉదయం ఖచ్చితంగా 9 గంటలకు పోటీ ప్రారంభమౌతుంది.
- సాయంత్రం 5 గంటలకు విజేతలకు బహుమతులు, ఉత్తమ పోటీ దారులకు సర్టిఫికెట్స్ ప్రదానం చెయ్యడం జరుగును.
- ఎంతమంది వస్తారో తెలియదు గనుక నిర్వాహకులు మద్యాహ్నం భోజన ఏర్పాట్లు చెయ్యడం లేదు. ఈ పోటీ 9 గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల లోపు ముగుస్తుంది గనుక విద్యార్థులు, వారితో వచ్చిన వారి తల్లిదండ్రులు వారి భోజన ఏర్పాట్లు వారే చూసుకుంటే మంచిది.
- పద్యాలను రాగయుక్తంగా చదవాలనుకుంటే www.bvbangarraju.com సైట్లోని కొన్ని పద్యాలు మీకు పనికివస్తాయి.
No comments:
Post a Comment